310 వార్డెన్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌

CAREER
CAREER

హైద‌రాబాద్ః రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకుల పాఠశాల్లో 310 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు టీఎ్‌సపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫిబ్రవరి 6 నుంచి మార్చి 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గిరిజన సంక్షేమశాఖలో 4 గ్రేడ్‌-1 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, 87 గ్రేడ్‌-2 వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు కాగా బీసీ గురుకులాల్లోని గ్రేడ్‌-2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు 219 ఉన్నాయి. రోస్టర్‌ పాయింట్లు, జిల్లాల వారీగా పోస్టుల వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు టీఎ్‌సపీఎస్సీ సెక్రటరీ వాణీప్రసాద్‌ తెలిపారు.