31 మంది మత్స్యకారులు గల్లంతు

Fishermen
Fishermen

కోల్‌కతా: బంగాళాఖాతంలో 31 మంది మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లి గల్లంతయ్యారు. అధికారులు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లవద్దంటూ హెచ్చరికలు చేసిన వారు పట్టించేకోకుండా సముద్రలోకి వెళ్లి గల్లంతయ్యారని సుందర్‌బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి మంతూరామ్‌ పఖీరా చెప్పారు. రెండు బోట్లలో వెళ్లిన 31 మంది మత్సకారులు గల్లంతయ్యారని ఆయన చెప్పారు. మరొక బోటులో వెళ్లిన 13 మంది మత్స్యకారులు బోటు ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో బంగ్లాదేశ్‌ జలాల్లోకి కొట్టుకుపోయారని రక్షణ శాఖ అధికారులు చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/