31న ఎర్రని జాబిలి

MOON
MOON

31న ఎర్రెర్రని జాబిలి

గ్రహణం రోజున చందమామ కొత్తరూపం

ఈనెల 31న ఆకాశంలో నిండు జాబిలి మేజిక్‌ చేయబోతున్నాడు. సాధారణంగా నెలకి రెండు పక్షాలు. అవి శుక్లపక్షం, కృష్ణపక్షం. ఈ రెండు పక్షాలలో చంద్రుడు కాంతి, రంగు,పరిమాణంలో తేడాలు ఉంటాయి. అందుకే చంద్రుడుకి పదహారు కళలు అని అంటారు కూడా. ఇది మనకు తెలిసిన విషయమే. చాలా చాలా అరుదుగా చంద్రుడు ఎరుపు రంగులో కనపడతాడట. 1866లో అలా కని పించాడు. ఇప్పుడు జనవరి31న కూడా నిండు ఎర్ర చంద మామగా మారతాడట. భారత్‌లో ఆరోజు సాయంత్రం 6.21 నుండి 7.37నిమిషాల వరకు ఆకాశంలో చంద్రుడు ఎర్రగా కనిపిస్తున్నాడు. దీన్ని బ్లడ్‌మూన్‌ అంటారు. చంద్రుడు భూమికి దగ్గరగా రావటం దీన్ని సూపర్‌ మూన్‌ అంటారు, నెలలో ఎక్కువ ప్రకాశవంతంగా కనబడటాన్ని బ్లూమూన్‌ అంటారు. ఇవన్నీ ఏకకాలంలో జరిగే రోజు జనవరి31. అం టే ఆకాశంలో చంద్రుడు రంగుల హరివిల్లులా కనిపిస్తాడన్న మాట. సూపర్‌ బ్లడ్‌ బ్లూమూన్‌ అనచ్చేమో. ఆసియా, ఆZసే లియా, న్యూజీలాండ్‌, రష్యాలలో చంద్రుడి రంగుల ప్రద ర్శనను చక్కగా తిలకించవచ్చని నాసా ఒక ప్రకటనలో తెలి పింది. మామూలు కంటితోనే పసిగట్టగలిగే ఈ వింతను చూడటంకోసం శాస్త్రవేత్తలతో పాటు మనం సిద్ధమవుదాం