31దాకా శంషాబాద్‌లో రెడ్‌అలర్ట్‌

 

SHAMSHABAD
హైదరాబాద్‌: రిపబ్లిక్‌డే సందర్బంగా ఈనెల 31 వరకూ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రెడ్‌అలర్ట్‌ ప్రకటించారు. వేడుకల సందర్బంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఈమేరకు చర్యలు తీసుకున్నారు. సిఐఎస్‌ఎఫ్‌, ఆక్టోపస్‌, బాంబ్‌, డాగ్‌స్క్వాడ్‌లను అధికారులు అప్రమత్తం చేశారు. ఈకారణంగా ఈనెల 31 వరకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సందర్శకులకు అనుమతి ఉండదని తెలిపారు.