APMAA మెంబర్ ని బెదిరించిన విష్ణు ప్యానల్ సభ్యుడు పృథ్వి

APMAA మెంబర్ ని బెదిరించిన విష్ణు ప్యానల్ సభ్యుడు పృథ్వి

మా ఎన్నికల సమయం దగ్గర పడింది. మరో రెండు రోజులైతే మా పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో బరిలో ఉన్న విష్ణు ప్యానల్ , ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు మాత్రమే కాదు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు ల వరకు వెళ్లింది. ఇక ఇప్పుడు బెదిరింపుల వరకు వెళ్లడం సంచలనం గా మారింది. విష్ణు ప్యానల్ సభ్యుడు 30 ఇయర్స్ పృథ్వి ..APMAA మెంబర్ కి ఫోన్ చేసి బెదిరించిన ఆడియో కాల్ బయటపడింది.

ప్రకాష్ రాజ్ కు ఎందుకు మద్దతు ఇస్తున్నారని పృద్వి ఫోన్ లో అడగడం జరిగింది. ప్రకాష్ రాజ్ తెలుగు వాడు కాదు..అలాంటి వాడికి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని పృద్వి అడిగారు. అవతలి వ్యక్తి ఏంచెపుతున్నాడో కూడా వినకుండా పృద్వి తాను చెప్పాలనుకున్నది చెప్పి ..ఫోన్ కట్ చేసాడు. ప్రస్తుతం ఈ ఫోన్ కాల్ ఇండస్ట్రీ లో చర్చ కు దారితీస్తుంది. మరి ఈ ఫోన్ కాల్ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

మరో పక్క మెగా ఫ్యామిలీ మద్దతు ప్రకాష్ రాజ్ కే అని మెగా బ్రదర్ మీడియా సమావేశం ఏర్పటు చేసి తెలుపడం జరిగింది. ‘మా ‘ ను అభివృద్ధి చేయగల వ్యక్తి ప్రకాష్ రాజ్ అని , అందుకే ఆయన కు సపోర్ట్ చేస్తున్నామని తెలుపడం జరిగింది.