దేశంలో కొత్తగా 3,06,064 కరోనా కేసులు
22,49,335 యాక్టివ్ కేసులు
corona virus-india
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. నిన్న దేశంలో 3,06,064 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొన్నటి కంటే నిన్న 27,469 కేసులు తక్కువగా నమోదయ్యాయి. నిన్న కరోనాతో 439 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా నుంచి కొత్తగా 2,43,495 మంది కోలుకున్నారు. కాగా, ప్రస్తుతం హోం క్వారంటైన్లు, ఆసుపత్రుల్లో 22,49,335 మందికి చికిత్స అందుతోంది. డైలీ పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/