305వ రోజు పాదయాత్ర

YS JAGAN
YS JAGAN

విజయనగరం:  జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి 305వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్‌ తన 305వ రోజు పాదయాత్రను కురుపాం నియోజకవర్గంలో తురకనాయుడువలస నుంచి ప్రారంభించారు. పాదయాత్ర నాగూరు, దత్తివలస క్రాస్‌, చిలకాం క్రాస్‌, రావివలస క్రాస్‌ మీదుగా మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించనుంది. వీరఘట్టం మండలం కెల్ల వద్ద జిల్లాలోకి ప్రవేశించనున్న జగన్‌ పాదయాత్ర పాలకొండ నియోజకవర్గంలో నడిమికెల్ల వరకు కొనసాగనుంది.