300 కంటైనర్లతో ద్రాక్ష ఎగుమతులు సిద్ధం

grapes
grapes

పూణె: ద్రాక్ష ఎగుమతులు ఈ సీజన్‌లో ముందస్తుగా ప్రారంభం అవుతున్నాయి. 300 కంటైనర్లు ఇప్పటికే పంపించినట్లు వెల్లడి అయింది. యూరోపియన్‌ మార్కెట్లకోసం వెళ్లే ద్రాక్షపండ్ల ఎగుమతుల కంటైనర్లు సహజంగా జనవరిముందస్తునుంచే ప్రారంభం అవుతాయి. మొత్తం 300 కంటైనర్లు ద్రాక్షతో నింపినవాటిని ఈ నెలలో ఎగుమతులు ప్రారంభించాయి. ద్రాక్ష ఉత్పత్తిదారులసంఘం అధ్యక్షుడు మాణిక్‌రావుపాటిల్‌ వివరాలప్రకారంచూస్తే రష్యా, మలేసియా, మధ్యతూర్పు దేశాలకు ఎగుమతులు జరుగుతున్నట్లు తేలింది. సహజంగా ద్రాక్ష ఎగుమతులు మహారాష్ట్రలో జనవరినుంచేప్రారంభం అవుతాయి. మొదట యూరోపియన్‌దేశాలకు ఎగుమతులు ప్రారంభిస్తారు. అయితే ఈ సారి ఇప్పటికే ఎగుమతులు ప్రారంభించారు. నాసిక్‌లోని సతానా తాలూకాలో ఎక్కువ జరుగుతున్నాయి.సతానాలోఉత్పత్తిదారులు వారి ఉత్పత్తులను నవంబరు డిసెంబరునెలల్లోనే తీసుకుని వస్తారు. సహజంగానే వారి ఉత్పత్తులు దేశీయ మార్కెట్లకు ముందు చేరుకుంటాయి. ఎగుమతులపరంగా కఠినమైన పరీక్షలను చేసిన అనంతరం నిర్ణయించిన గ్రేడ్‌ప్యాకిగ్‌లలో ద్రాక్షను ఎగుమతులుచేసారు. రసాయనాలు తక్కువ ఉన్న నిబంధనలను అమలుచేయాల్సి ఉంటుంది. సాగులోనే ఈ పద్దతులన్నీ పాటించాల్సి ఉంటుంది. ఉత్పత్తిలో కనీస రసాయనాలు ఉండేటట్లు చూస్తారు. రైతులు ఏసమయంలో వాటిని పండించేదీ నిర్ణయిస్తారు. సతానా ఉత్పత్తిదారులు ముందుగానే ద్రాక్షను పండిస్తుండటంతో వారి ఉత్పత్తులు ముందుగా మార్కెట్లకు చేరుతుంటాయి. ఎక్కువగా పూణె, సంగ్లి, ఇతర ప్రాంతాలనుంచి ఎగుమతులకు వస్తుంటాయని పాటిల్‌ వెల్లడించారు.