భారత్‌ – లండన్‌ మధ్య వారానికి 30 సర్వీసులు

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల నుంచి మాత్రమే ఈ విమాన సర్వీసులు: కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

Air Travel between India-UK
Air Travel between India-UK

భారత్‌ నుంచి లండన్‌కు, లండన్‌ నుంచి భారత్‌కు వారానికి 30 సర్వీసులు నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 23 వరకు ఈ మేరకు పరిమితి సంఖ్యలో విమానాలను నడపాలని నిర్ణయించింది.

ప్రస్తుతం భారత్‌, యూకేల మధ్య వారానికి 60 విమానాలు నడుస్తున్నాయి. ఇప్పటివర కు భారత్‌లోని 10 నగరాల నుంచి లండన్‌కు విమాన సర్వీసులు నడవగా… ఇక నుంచి ప్రాథమిక దశలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు నగరాల నుంచి మాత్రమే విమాన సర్వీసులు నడవనున్నాయి.

జనవరి 8 నుంచి ఈ పరిమితి సంఖ్య విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ఇరుదేశాలకు చెందిన విమానయాన సంస్థలు కేవలం 15 సర్వీసుల చొప్పున నిర్వహించాలి.

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబా ద్‌ నగరాల నుంచి మాత్రమే లండన్‌కు ఈ విమాన సర్వీసులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కాగా ఎయిరిండియా, విస్తారా, బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌, వర్జిన్‌ అట్లాంటిక్‌ విమానయాన సంస్థలు మాత్రమే రెండు దేశాల మధ్య సర్వీసులు నడపనున్నాయి. కాగా డిసెంబర్‌ 22 నుంచి డిసెంబర్‌ 31 వరకు బ్రిటన్‌కు విమానాలు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/