సౌదీలో బందీలుగా మగ్గుతున్న తెలంగాణ వాసులు

House Arrest
House Arrest

హైదరాబాద్‌: సౌదీ అరేబియాలో బందీలుగా 30 మంది తెలంగాణ కార్మికులు మగ్గిపోతున్నారు. జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ నుంచి సౌదీలో ఉపాధి కోసం వెళ్లిన 400 మంది కార్మికులు వెళ్లారు. ఏడాదిగా ఒకే గదిలో తెలంగాణ వాసులు మగ్గుతున్నారు. వర్క్‌ పర్మిట్‌ రెన్యువల్‌ చేయకుండా కంపెనీ చేతులెత్తేయడంతో జౌల్లో మగ్గి కొన్నాళ్లకు స్వదేశానికి కొందరు కార్మికులు చేరుకున్నారు. ఐతే మరో 30 మంది కార్మికులు మాత్రం కంపెనీకి చెందిన గదిలో బంధీలుగా ఉన్నట్లు సమచారం. తిండి, నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్న తమ వారిని ఆదు కోవాలని కేసిఆర్‌, కేటిఆర్‌లకు బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేశాయి.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/