ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
Jammu and Kashmir encounter

షోపియాన్‌: జమ్ముకశ్మీర్‌ షోపియాన్‌ జిల్లాలోని అన్నిపొరా ప్రాంతంలో శనివారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అన్నిపొరా గ్రామంలో హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు, సైనిక విభాగానికి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్ పీఎఫ్ జవాన్లు శనివారం ఉదయం గాలింపు చేపట్టారు. దాక్కున్న ఉగ్రవాదులు జవాన్లపైకి కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/