ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెండ్

AP Assembly Deputy Speaker Kona Raghupati
AP Assembly Deputy Speaker Kona Raghupati

Amaravati: ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సస్పెండ్ చేశారు. శాసనసభలో ప్రారంభం నుంచే అధికార, విపక్షాల మాటల యుద్ధం జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు కింజరాప్ అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలను డిప్యూటీ స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సెషన్ ముగిసే వరకు ముగ్గురు టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు.