‘అరవింద’…మూడో భామ

3 Heroine
3 Heroine

‘అరవింద’…మూడో భామ

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన అరవింద సమేత చిత్రం విడుదలకు సిద్ధమైంది.. ఇటీవలే షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రంకు సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు నిర్వహిస్తున్నారు.. మొదటి నుంచి ఇద్దరు హీరోయిన్లు అంటూ ప్రచారం సాగింది.. పూజాహెగ్డేతోపాటు తెలుగమ్మాయి ఈషారెబ్బా కూడ నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. కాగా వీరిద్దరితోపాటు మూడో భామ కన్పించనున్నట్టు సమాచారం.. తెలుగులో ఇప్పటికే ఓమై గాడ్‌,, అనగనగా ఒక చిత్రం, ఖాకీ చిత్రాల్లో నటించిన కన్నడ ముద్దుగుమ్మ మేఘశ్రీ కూడ ఈచిత్రంలో నటించినట్టు సమాచారం.. ఒక కీలకమైన రోల్‌లో మేఘశ్రీ కన్పించబోతుందని విశ్వసనీయ సమచారం.. రాయలసీమ ఫాక్ష్యన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈచిత్రం అక్టోబర్‌ 11న విడుదల కాబోతోంది..