25కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ పట్టివేత

Drugs
Drugs

న్యూఢిల్లీ: ఢిల్లీలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు ఈరోజు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా వారు రూ..25కోట్ల విలువ చేసే 5 కేజీల హీరాయిన్, 2.6 కేజీల కొకైన్‌ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మాదక ద్రవ్యాలను ముంబై నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. అంతేకాక డగ్స్ కలిగి ఉన్న ఇద్దరు నైజీరియన్లతో పాటు ఉగండా దేశస్థురాలిని పోలీసులు అరెస్టు చేశారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/