3 వికెట్లు కోల్పోయిన కివీస్

Newzealand batting4
Newzealand batting4

మౌంట్‌ మాంగనుయ్‌: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు రెండో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. షమీ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి ఓపెనర్ కోలిన్ మన్రో (7) రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (13) భువనేశ్వర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్‌తో కలిసి కెప్టెన్ విలియమ్సన్ (28) జాగ్రత్తగా ఆడాడు. ఇద్దరూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. . ప్రస్తుతం 25 ఓవర్లు ముగిసే సరికి కివీస్ మూడు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. రాస్ టేలర్, టామ్ లాథమ్ క్రీజులో ఉన్నారు.