29, 30 తేదీల్లో ఆర్టీసి బుకింగ్‌, పార్శిల్‌ డెలివరీ నిలిపివేత

APSRTC
APSRTC


విజయవాడ: ఏపిఎస్‌ఆర్టీసి కార్గో సర్వీస్‌ స్టాక్‌ వెరిఫికేషన్‌ నిమిత్తం ఈ నెల 29, 30 తేదీల్లో బుకింగ్‌, డెలివరీలను తాత్కాల్కింగా నిలిపివేస్తున్నట్లు ఆర్టిసి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 29 వ తేదీ రాత్రి 8 గంటలనుంచి 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పార్విల్‌ బుకింగ్‌ నిలిపివేయనున్నట్లు తెలిపారు. 30 వతేదీ మధ్యాహ్నం 12 గంటలనుంచి జూలై 1వ తేదీ ఉదయం 9 గంటల వరకు పార్శిల్‌ డెలివరీ నిలిపివేయనున్నట్లు ఆయన తెలిపారు. కస్టమర్లు ఆర్టిసి కార్గో సర్వీస్‌ అధికారులు, సిబ్బందికి సహకరించాలని ఈడి కోరారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/