29 నుంచి సచివాలయం నుంచే పాలన: చంద్రబాబు

CMfff

29 నుంచి సచివాలయం నుంచే పాలన: చంద్రబాబు

గుంటూరు: ఈనెల 29 నుంచి అమరావతిలోని తాత్కాలిక సచివాలయం నుంచే పాలన ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం భవన నిర్మాణాలను ఆయన పరిశీలించారు.అనంతంర మాట్లాడుతూ, జూన్‌ 29 నాటికి సచివాలయం అయిదో భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌ పూర్తవుతుందని అన్నారు. జూలై 6నాటికి 5వ భవనం ఎఉదటి అంతస్తు నిర్మాణం, 15నాటికి నాలుగు భవనాల గ్రౌండ్‌ ఫ్లోర్‌, 21 నాటికి 4 భవనాల మొదటి అంతస్తులు పూర్తి అవుతాయన్నారు. తనతో సహా మంత్రులందరూ ఇక్కడి నుంచే పనిచేస్తారని చంద్రబాబు తెలిపారు.