29న ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ విడుదల

seethamma andalu ramayya sitralu
ఉయ్యాల జంపాలా… సినిమా చూపిస్త మామ, కుమారి 21 ఎఫ్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ విజయాలను పూర్తిచేసి క్రేజీస్టార్‌గా మారిన యువ కథనాయకుడు రాజ్‌తరుణ్‌ నటిస్తున్న మరో క్రేజీ చిత్రం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు.. జనవరి 29న ఈచిత్రం విడుదల కాబోతోంది.. ఈచిత్రానికి శ్రీనివాస్‌ గవిరెడ్డి దర్శకుడు.. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి పూర్ణి ఎస్‌.బాబ సమర్పణలోఒ ఎస్‌.శైలేంద్రబాబు, కెవి శ్రీధర్‌రెడ్డి, హరీష్‌ దుగ్గిశెట్టి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు..ఈ సందర్భంగా నిర్మాతలు చిత్రం విశేషాలను చెబుతూ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో సున్నితమైన భావోద్వేగాలకు, వినోదానికి పెద్దపీట వేయటం జరిగిందన్నారు. రాజ్‌తరుణ్‌ పాత్ర సరికొత్తగా ఉంటుందన్నారు. ఈచిత్రంతో అర్తన అనే నూతన హీరోయిన్‌ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతోందన్నారు. నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈచిత్రంలోని పతాక సన్నివేశాలను భారీ ఖర్చుతో చిత్రీకరించామని, చిత్రంఓల పతాక సన్నివేశాలు హైలెట్‌గా ఉంటాయన్నారు. తప్పకుండా ఈ చిత్రం రాజ్‌తరుణ్‌ సెకండ్‌ హ్యాట్రిక్‌కు శ్రీకారంలా ఉంటందన్నారు.. ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదలైన పాటలకు మంచిస్పందన వస్తోందన్నారు. సంగీత దర్శకుడు గోపిసుందర్‌ బాణీలు ప్రేక్షకులను అలరిస్తున్నా యన్నారు.. జనవరి 29న ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని అన్నారు. రాజ్‌తరుణ్‌, అర్తన, రణధీర్‌, రాజా రవీంద్ర, ఆదర్శ్‌, షకలక శంకర్‌ మధునందన్‌, విజయ్ జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ , రత్నసాగర్‌ ,వీన్‌ , భార్గవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్‌, పాటలు: సుద్దాల అశోక్‌ తేజ, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, వనమాలి, కృష్ణచైతన్య,.