29న లచ్చిందేవికి ఓ లెక్కుంది..
మగధీర, మర్యాదరామన్న, ఈగ చిత్రాలకు దర్శకత్వశాఖలో పనిచేసిన జగదీష్ తలశిల, బాహుబలికి…టీంలో లేడు అనే విషయం వినగానే భయపడ్డాను. ఈ మాటలు అన్నది ఎవరో కాదు తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి తెలియచేసిన, కళామ్మ తల్లి ఆణిముత్యం, దర్శకదిగ్గజం రాజమౌళి గారి నోటి నుండి వచ్చిన మాటుల. జగదీష్ తలశిల దర్శకుడిగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్‌పై సాయి ప్రసాద్ కామినేని నిర్మిస్తున్న లచ్చిందేవికి ఓ లెక్కుంది చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రాలు పూర్తి చేసుకుంది. నిర్మాత సాయి ప్రసాద్ కామినేని మాట్లాడుతూ మా బ్యానర్లో వస్తున్న మొదటి సినిమా ఇది. జగదీష్ నా స్నేహితుడు. ప్రతి సన్నివేశాన్ని లింక్ చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్గా జగదీష్ తెరకెక్కించాడు. మా ఈ చిత్రంతో ఈ నెల 29న మీ ముందుకు వస్తున్నాం. లచ్చిందేవి ఆశిస్సులు మీకు, మీ ఆశిర్వాదం మాకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.