29న మంత్రి భూమా అఖిల వివాహాం

Bhooma Akhilapriya
Bhooma Akhilapriya

నంద్యాలః ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి భూమా అఖిలప్రియ వివాహానికి ఏర్పాట్లు ముమ్మ‌రంగా జరుగుతున్నాయి. ఈ నెల 29వ తేదీ ఉదయం 10.57 గంటలకు ఆమె వివాహం పారిశ్రామికవేత్త భార్గవరామ్ తో జరగనుంది. ఇప్పటికే భూమా కుటుంబం శుభలేఖల పంపిణీని ప్రారంభించింది. శుభలేఖ ఎంతో ఆకట్టుకుంటోంది. శుభలేఖపై తన తల్లిదండ్రులు శోభ, నాగిరెడ్డిల ఫొటోలను ముద్రించారు. కర్నూల్ జిల్లాలని ఆళ్లగడ్డలో ఉన్న భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో వివాహం జరగనుంది. సెప్టెంబర్ 1న హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో రిసెప్షన్ జరగనుంది.