28% పెరిగిన హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ లాభం

IT sector
IT sector

28% పెరిగిన హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ లాభం

ముంబయి, మే 12: భారత్‌లోని నాలుగో అతిపెద్ద ఐటిసేవల సంస్థ హెచ్‌సిఎల్‌ టెక్నా లజీస్‌ మార్కెట్‌ నిపుణుల అంచనాలను అధిగమించి ఆర్థికఫలితాలు రాబట్టింది.నాలుగో త్రైమాసికంలో నికరలాభం 28శాతం పెరిగింది. రూ.475 కోట్ల లాభంతో ఈ త్రైమాసికంలో మంచి పనితీరు చూపించింది. అంతకుముందు

ఇదే కాలంలో 1939 కోట్లు మాత్రమే సాధించింది. నిపు ణుల అంచనాల ప్రకారంచూస్తే నికరలాభం రూ.2091కోట్లు ఉంటుందని అంచనా. కంపెనీ నాలుగో త్రైమాసికంలో నికరరాబడులు సాఫ్ట్‌వేర్‌ సేవలద్వారా 23శాతం పెరిగి 7743 కోట్లకు చేరింది. నోయిడా కేంద్రంగా ఉన్న హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌కు సైతం హెచ్‌వన్‌బి వీసాల ఆంక్షల ప్రభావం పడింది. అమె రికా ఆంక్షల ఫలితంగా కంఎనీలు స్థానికంగానే నియామకాలు చేపట్టాయి. అంతేకాకుండా కొత్త పంపిణీ కేంద్రాలు ప్రారంభిస్తున్నాయి. 150 బిలియన్‌ డాలర్ల భారత్‌ ఐటిరంగానికి నేడు వీసా ఆంక్షలు శరా ఘాతంగా మారాయి. దీనికికారణం 60శాతం భారత్‌ ఐటి రంగ రాబడులు అమెరికానుంచే రావడం ఇందుకు ప్రధానకారణం. హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌పరంగా ముందునుంచే అప్రమత్తం అయ్యామని ఎలాం టి దేశంలో అయినా ఏవిధమైన భౌగోళిక ప్రాంతంలో అయినా వలస వీసా సవాళ్లను అధిగమించగల మని సిఇఒ సి.విజ§్‌ుకుమార్‌ వెల్లడించారు.

ఏడెనిమిదేళ్ల క్రితమే ఇలా అవుతుందని గుర్తించామన్నారు. అమెరికాలో తమకు 12 డెలివరీ కేంద్రాలున్నాయని, 12వేల మంది ఆన్‌షోర్‌లో పనిచేస్తున్నారని 55 శాతం అక్కడి వారే పనిచేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత ఆంక్షలవల్ల తమకెలాంటి నష్టం ఉండబోదని సులువుగా అధిగమించగలమని అన్నారు. ఐఒటి, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌సేవలు, అనలిటిక్స్‌, క్లౌడ్‌ సేవలు, ప్రొడక్ట్‌ ప్లాట్‌ఫామ్‌లపరంగా హెచ్‌సిఎల్‌ సేవలు సానుకూలంగానే ఉన్నాయి. స్థిరమైన కరెన్సీ రేటింగ్‌లో టెక్నాలజీ రాబడులు 3.8శాతం పెరిగి 16.1శాతంగా ఉంది. మొత్తం రాబడులు డాలర్‌ విలువల్లో చూస్తే 1,817 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ముఖ్య ఆర్థిక అధికారి అనిల్‌చనానా మాట్లాడుతూ కంపెనీ డెలివరీకేంద్రాల్లో ప్రత్యేకించి అమెరికావంటి భౌగోళిక ప్రాంతాల్లోఎక్కువ పెట్టుబడులు పెడుతుందని అన్నారు. కంపెనీ సీనియర్‌కార్పొరేట్‌ ఉపాధ్యక్షుడు కారణ్‌పూరిమాట్లాడుతూ రెండుదశాబ్దాలక్రితం జపాన్‌ కార్ల తయారీ సంస్థలు ఎదుర్కొన్న పరిణామాలే ప్రస్తుతం అమెరికా ట్రంప్‌ పాలనాయంత్రాంగలో అమలవుతున్నాయని ఆనాటి పరిస్థితులు జపాన్‌కంపెనీలు అధిగమించినట్లే అమెరికా ఆంక్షలు కూడా ఐటి సంస్థలు అధిగమించగలవని అన్నారు.