28 తీర్మానాలు ఆమోదం: ముగిసిన మహానాడు

6

28 తీర్మానాలు ఆమోదం

తిరుపతి: సమైక్య ఆంధ్రలో తొలి మహానాడు జరుపుకుంటే రాష్ట్ర విభజన అనంతరం 35వ మహానాడును జాతీయ పార్టీగా తిరుపతిలో జరుపుకున్నామి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మూడు రోజుల మహానాడు ముగింపు సందర్భంగా ప్రసంగించారు. మహానాడులో చర్చలు బాగా చేశామ ని, కార్యకర్తలు, క్రిందిస్థాయిలో అంటే గ్రామీణస్థాయి నాయకులు చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. మొత్తం 28 తీర్మానాలను ఆమోదించామని తెలిపారు.