28న లండన్‌లో టాక్‌ ఆవిర్భావ సభ

taak
TAAK

28న లండన్‌లో టాక్‌ ఆవిర్భావ సభ

తెలంగాన భాష సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా తెలంగాన అసోసియేషన్‌ ఆప్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (టాక్‌) ఆవిర్భవించనుంది.. యుకెలో నివాసం ఉంటున్నప్రవాస తెలంగాణ వారందరినీ ఏకం చేస్తూ ఈనెల 28న లండన్‌లో సంస్థ ఆవిర్భావ సభ జరగనుంది.. ఈమేరకు అన్ని ఏర్పాటు పూర్తిచేస్తున్నారు. కాగా. హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో టాక్‌ ఆవిర్భావ పోస్టర్‌ను ప్రఖ్యాత కవి నందిని సిద్ధారెడ్డి ఆవిష్కరించారు.
టాక్‌ ప్రతినిధులు నవీన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్వేతారెడ్డి, , పోచారం సురేందర్‌రెడ్డి, రాజు, రాజ్‌కమార్‌ ప్రభృతులు పాల్గొన్నారు.