28న ‘పైసా వసూల్‌’ స్టంపర్‌ రిలీజ్‌

BALA KRISHNA-2
BALA KRISHNA

28న ‘పైసా వసూల్‌’ స్టంపర్‌ రిలీజ్‌

నందమూరి బాలయ్య, పూరిజన్నాధ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పైసా వసూల్‌.. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్‌ పూర్తై, ప్యాచ్‌ వర్క్‌ జరుపుకుంటోంది.. అది కూడ ఈ వారంలోనే పూర్తికానుంది.. ఈనెల28న ఈచిత్రం కు సంబంధించిన స్టంపర్‌ని విడుదల చేయనున్నారు.. ఈసందర్బంగా దర్శకుడు పూరి జగన్నాధ్‌ మాట్లాడారు.. నందమూరి బాలకృష్ణతో కలిసి ఫస్ట్‌ టైమ్‌ ఈసినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా , గర్వంగా ఉంది.. నా కెరీర్‌లోనే ఇదొక మెమొరబుల్‌ మూవీ అవుతుంది.. బాలక్ణృగారు ఈపాత్రలో లీనమైన తీరుచూసివండర్‌ అయిపోయాను.. నందమూరిఅభిమానులు కోరుకునే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి.. డైలాగులు, సాంగ్స్‌ అదిరిపోయే లెవెల్‌ళో ఉంటాయి.. ఈసినిమా ఎలా ఉండబోతోందో రేపు 28న విడుదలకాన్ను స్టంపర్‌ చూస్తే అర్ధమవుతుందని అన్నారు. రెగ్యులర్‌గా అందరూ విడుదల చేసే టీజర్‌ టైల్రర్‌కి భిన్నంగా ఈ స్టంపర్‌ ఉంటుందన్నారు.
నిర్మాత వి. ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ, బాలకృష్ణ పూరిజగన్నాధ్‌ల కాంబినేషన్‌లో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగా ఉందన్నారు.. మా భవ్య క్రియేషన్స్‌ సంస్థ ప్రతిష్టను నెక్ట్‌ లెవెల్‌కు తీసుకెళ్లే సినిమా అవుతుందన్నారు.. ఈ వారంతో ప్యాచ్‌ వర్క్‌ కంప్లీట్‌ అవుతుందని., డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి కావొచ్చాయన్నారు. ఆడియో వేడుకను త్వలరోనే గ్రాండ్‌గా రిలీజ్‌ చేయటానికి సన్నాహలు చేస్తున్నామన్నారు..