తెలంగాణలో కొత్తగా 2,751 పాజిటివ్ కేసులు
మొత్తం కేసుల సంఖ్య 1,20,166

హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత 24గంటల్లో 2,751 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,20,166కి చేరింది. తాజాగా వైరస్ ప్రభావంతో 9 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 808కి చేరుకుంది. తాజాగా 1,675 మంది వైరస్ నుంచి కోలుకోగా ఇప్పటి వరకు 89,350 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 30,008 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. 23,049 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని చెప్పింది. తాజాగా నమోదైన 2,751 పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీలో 432, కరీంనగర్ 192, రంగారెడ్డి 185, నల్గొండ 147, ఖమ్మం 132, మేడ్చల్ మల్కాజ్‌గిరి 128, నిజామాబాద్ 133, సూర్యాపేఏట 111, వరంగల్ అర్బన్ 101 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/