శ్రీరామ్ సాగర్ 26 గేట్లు ఎత్తివేత

ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు

sriram-sagar-project

హైదరాబాద్‌: ఎగువ కురిసే వర్షాలతో శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. 96,013 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నిండిపోయింది. ఈ క్రమంలో 26 గేట్లను ఎత్తి 75వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం పూర్తిస్థాయిలో 1,091 అడుగుల నీటి మట్టం ఉంది. రాత్రి భారీ వర్షాలు కురవడంతో బుధవారం తెల్లవారుజామున 40 గేట్లను ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు. ఐతే ఉదయం 11 గంటల తర్వాత వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో 14 గేట్లను మూసివేసి 26 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం సదర్మత్‌ కాలువ ద్వారా 8 వేలు, కాకతీయ కాలువ ద్వారా 1000, సరస్వతి కాలువ ద్వారా 500, లక్ష్మీ కాలువ ద్వారా 300, వరద కాలువ ద్వారా 10,371 క్యూసెక్కుల చొప్పును నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/