పాక్‌లో అరెస్టైన హఫీజ్‌ సయ్యద్‌!

Hafiz Muhammad Saeed
Hafiz Muhammad Saeed, Jamatud Dawa (JuD) chief

లాహోర్‌: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా చీఫ్‌ హఫీజ్‌ సయ్యద్‌ అరెస్ట్‌ అయ్యాడు. పాకిస్థాన్‌లోని గుజ్రన్‌వాలా నుంచి లాహోర్‌ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న హఫీజ్‌ను ఉగ్రవాద నిర్మూలన విభాగం అరెస్ట్‌ చేసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. లష్కర్‌-ఏ-తోయిబాతో పాటు దాని అనుబంధ సంస్థలను నిర్మూలించేందకు చర్యలు తీసుకుంటున్నట్లు గత వారం పాక్‌ అధికారిక వర్గాలు ప్రకటించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే లష్కర్‌ వ్యవస్థాపకుడు హఫీజ్‌పై కేసులు నమోదు చేశారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos