25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం

RAJATH KUMAR
RAJATH KUMAR

హైదరాబాద్: గత ఎన్నికల్లో ఓటర్ల జాబితా విషయంలో ఎక్కువ ఆరోపణలు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఏటా జనవరి 1వ తేదీతో కొత్త ఓటరు జాబితా ప్రకటిస్తామని చెప్పారు. ఈ ఏడాది ఓట్ల నమోదు కోసం కొత్తగా 8 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఓటు తొలిగింపు కోసం 10వేల దరఖాస్తులు వచ్చాయి. జనవరి 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. ఫిబ్రవరి 25న తుది ఓటరు జాబితా ప్రచురిస్తాం. తుది ఓటరు జాబితా ముద్రించిన తర్వాత ఓట్ల తొలగింపు చేయడం ఉండదు. తుది జాబితా ముద్రణ తర్వాత డబుల్ ఓట్లు కూడా తొలగించడం కుదరదు. హైదరాబాద్ పరిధిలో 6 లక్షల ఓట్ల తొలగింపు జరిగింది. ఎన్నికలకు ముందు ఓటరు జాబితాలో పేరు సరిచూసుకోవడం కూడా పౌరుల బాధ్యత అని రజత్‌కుమార్ వ్యాఖ్యానించారు.