25వ పాశురం

GODA DEVI1
GODA DEVI

25వ పాశురం

రుత్తి మగనా§్‌ు ప్పిఱన్దు ఓరిరవిల్‌ ఒరుత్తి మగనా§్‌ు ఒళిత్తు వళర తరిక్కి లానాగి, త్తాన్‌ తీజ్గనినైన్ద కరుత్తై పిఱైపిత్తు, కజ్గన్‌ వయిణ్‌జ్గల్‌ నెరుప్పెన్న నిన€ నెడుమాలే! ఉన్నై అరుత్తిత్తువన్దోం, పఱై తరుదియాగిల్‌ తిరుత్తిక్క శెల్వముం శేవగముంయామ్పాడి వరుత్తముం తీర్‌న్దు మగిణ్‌ న్దేలో రెమ్బావా§్‌ు! ఇరవై ఐదవ పాట ఒకామె (దేవకీ) గర్భాన జన్మించి నీవ్ఞ నాడే, ఒకామె(యశోద)వడిచేరి మురిపించినావ్ఞ గోపెమ్మ ఒడిలోన గోప్యముగ ఒదిగి ముద్దుముద్దుగ దినదినము పెరుగుచుండ దుష్టకంసుడు పంప దూతలొచ్చి నీచేత చచ్చె, కంసుని కడుపు కాలునట్లు, శ్రీలక్ష్మి మెచ్చిన శౌర్య సంపద నీవ్ఞ ఆశ్రితుల రక్షించ అవతరించితివి నీ దివ్యనామములు పాడిపాడి సేదతీర నిన్ను సేవించ వచ్చితిమి అలుపు తీరమమ్మ ఆదుకోనాథా! నేడు నోచిన మానోము పంట పండ. భావం: కృష్ణుడు దేవకి కుమారుడై పుట్టి అదేరాత్రి యశోదకు బిడ్డడై పెరిగినాడు. కంసుడు చెడు ఆలోచనతో నీకు కీడు తలపెట్టగా అతని ఆలోచనను వ్యర్థము చేసిన, నిన్ను ఆశ్రయించిన వానికి మేలు చేయువాడా నిన్ను కోరటానికి వచ్చినాము. ‘పరయను వాయిద్యమును మాకు ఇమ్ము. లక్ష్మీదేవికి పొందిన ఐశ్వర్యము. చరిత్ర పాటలుగా గానము చేసి శ్రమను తీర్చుకొని ఆనందిస్తున్నాము. ఫలం: సత్‌ సంతాన ప్రాప్తి.