25న కమల్‌నాధ్‌ కేబినెట్‌ విస్తరణ

Kamalnath
Kamalnath

బోపాల్‌: మద్యప్రదేశ్‌ముఖ్యమంత్రి కమల్‌నాధ్‌ తన ప్రభుత్వాన్ని ఈనెల 25వ తేదీ ఏర్పాటుచేస్తారని చెపుతున్నారు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు శనివారం మాట్లాడుతూ క్రిస్మస్‌ సందర్భంగా ఈనెల 25వ తేదీ కమల్‌ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని చెపుతున్నారు. ప్రస్తుతం కమల్‌నాధ్‌ న్యూఢిల్లీలో బసచేసి పార్టీ హైకమాండ్‌తో చర్చలుజరుపుతున్నారు. కొందరు కొత్త మంత్రులకుసైతం అవకాశం ఉంటుందని 25వ తేదీ వారిపేర్లుప్రకటిస్తారని చెపుతున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌నేత ఈనెల 17వ తేదీ ముఖ్యమంత్రిగాప్రమాణస్వీకారంచేసిన సంగతి తెలిసిందే. 15ఏళ్లపాటు బిజెపి పాలనలో ఉన్న రాష్ట్రంనుంచి పాలనపగ్గాలుచేపట్టారు. పార్టీ వేగుల సమాచారంప్రకారంచూస్తే ఒకరిద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలకుసైతం మంత్రివర్గంలో బెర్త్‌ లభిస్తుందని చెపుతున్నారు. కాంగ్రెస్‌ప ఆర్టీఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా 230మంది సభ్యులున్న అసెంబ్లీలో మ్యాజిక్‌మార్కు రావాలంటే 116 స్థానాలు సాధించాల్సి ఉంటుంది. అందువల్ల పార్టీ బిఎస్‌పి, ఎస్‌పి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు వారంతా కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్ధులే వారి మద్దతునుసైతం తెలిపారు. దీనితో మొత్తం సభ్యులసంఖ్య 121కి చేరింది. బిజెపి 109స్థానాలుమాత్రమే సాధించింది. మంత్రివర్గం కూర్పులో కమల్‌నాధ్‌ అత్యంత సవాల్‌నే ఎదుర్కొంటున్నారు. పార్టీలోను ఎన్నికైన ఎమ్మెల్యేల్లోవర్గాలను ఏకంచేయాల్సి ఉంటుంది. మిత్రపక్షాలతోపాటు స్వతంత్రులను కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సిఉంది. మద్యప్రదేశ్‌ కాంగ్రెస్‌పార్టీ శిబిరాలుగా మారిపోయింది. గుణా ఎంపి జ్యోతిరాదిత్యసింధియా, పాత గార్డుదిగ్విజ§్‌ుసింగ్‌ సురేష్‌ పచౌరిలు వర్గాలుగా మారిపోయాయి. మాజీ ముఖ్యమంత్రి బిజెపి నేత శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ తన పార్టీ పరంగా ఎంపి అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రపోషిస్తోంది.జనవరి 7వ తేదీనుంచి అసెంబ్లీసమావేశాలుప్రారంభం అవుతున్నాయి.