తెలంగాణలో కొత్తగా 2,479 కేసులు

నిన్న ఒక్క రోజే 10 మంది మృత్యువాత

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 2,479 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,47,642కు పెరిగింది. నిన్న ఒక్క రోజే కరోనా బారినపడి 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 916కు పెరిగింది. గత 24 గంటల్లో 62,649 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 18,90,554కు పెరిగింది. ఇక, ఇప్పటి వరకు 1,15,072 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 2,485 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 31,654 కేసులు యాక్టివ్‌గా ఉండగా, హోం, సంస్థాగత ఐసోలేషన్‌లో 24,471 మంది ఉన్నట్టు ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ ద్వారా తెలిపింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/