తెలంగాణలో కొత్తగా 2,478 మందికి కరోనా

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,35,884

telangana-corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కోరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ల్లడించిన వివరాల ప్రకారం… రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,478 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,011 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,35,884కి చేరింది. తెలంగాణలోని ఆసుపత్రుల్లో 32,994 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 1,02,024 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 866కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 267 కరోనా కేసులు నమోదయ్యాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/