దేశంలో కొత్తగా 2,451 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గత వారం రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెట్ ప్రకారం.. దేశంలో కొత్తగా 2,451 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 14,241 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,30,52,425కి చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు మొత్తం 5,22,116 మంది మరణించారు. దేశంలో రికవరీ రేటు 98.76గా ఉంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/