పాక్‌లో ఘోర ప్రమాదం..24 మంది మృతి

Pakistan accident after passenger bus
Pakistan accident after passenger bus

పెషావర్ : వేగంగా వస్తున్న బస్సు మురుగుకాల్వలో పడి 24 మంది ప్రయాణికులు మరణించారు.
ఈ ఘటన పాకిస్థాన్ దేశంలోని ఖైబర్ ఫక్తూన్ ఖవా ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఖైబర్ ఫక్తూన్‌ఖవా అప్పర్ కోహిస్థాన్ జిల్లా కుండియా తహసీల్ పరిధిలోని బాగ్రా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 24 మంది మరణించారు. సమాచారం తెలుసుకున్న పాకిస్థాన్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాలను వెలికితీశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/