24 లోగా రాష్ట్రానికి ఇవిఎంలు

RAJATH KUMAR
RAJATH KUMAR

మ్యానిఫెస్టోలను ముందుగా మేం పరిశీలించాలి
ఓటర్ల జాబితాలో అభ్యంతరాలను పరిష్కరిస్తాం
ఈవిఎంలపై అనుమానాలు పడాల్సిందేమీ లేదు
నగదు పంపినీపై నిఘా పెడతాం: రజత్‌కుమార్‌
హైదరాబాద్‌: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల ముసాయిదా జాబితా సవరణ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో ఉన్న అభ్యంతరాలను పరిష్కరిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్‌ లిస్టులతో పోలింగ్‌ బూత్‌లవారీగా విభజన జరుగుతుందన్నారు. ఈనెల 15,16వ తేదీల్లో గ్రామ స్థాయిలో పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాపై ఉన్న అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరిస్తా మని చెప్పారు. ఓటర్లను చైతన్య పరిచేందుకు తమ యంత్రాంగం చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలను చైతన్య పరిచేలా ప్త్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈవీఎంల పనితీరుపై ఎలాంటి అను మానం వద్దు అని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. మన దేశంలో ఈవీఎంల పనితీరు చాలా పక్కగా ఉందన్నారు.న్యాయ స్థానాల్లో 37 కేసులు వేసినా ఈవీఎంలపై అనుకూలంగానే నిర్ణయం వచ్చిందని తెలిపారు. ఈనెల 20లోగా కావాల్సినన్నీ ఈవీఎంలు రాష్ట్రానికి వస్తాయి.ఈవీఎం మిషన్లు రాగానే వాటిని రాజకీయ పార్టీల సమక్షంలో పరీక్షిస్తాం. ఈసారి కొత్తగా వీవీ ప్యాట్‌ మిషన్లు ఏర్పాటు చేస్తామని రజత్‌కుమార్‌ చెప్పారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు పంపిణీ చేసే నగదుపై నిఘా పెడుతామని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు.అభ్యర్థుల ఎన్నికల ఖర్చును క్షుణ్ణంగా పరిశీలిస్తా మన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారంపై వచ్చే కథనాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. ఆయన మీడియాతో మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి.
‘కేంద్ర బృందం వచ్చారు వారు ఇక్కడ పరిస్థితులను అన్ని తెలుసుకున్నారు. ముందస్తు ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంటుంది. ఓటర్ల జాబితా జనవరి 2018 నాటిదే వాడాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఎన్నికలు జరగాలంటే ఇప్పటి నుంచే ప్రాసెస్‌ చేయాలి. ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఇది సుప్రీం కోర్టు తీర్పు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్టు చేస్తున్నాం. ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించగలమా? అనే సవాళ్లు ఉన్నాయి. ఎలక్ట్రోరోల్స్‌ అన్ని రాజకీయ పార్టీలకు పంపించాం. వారి అభ్యంతరాలను స్వీకరించాం. బూత్‌ లెవల్‌లో గత ఎన్నికల్లో 14 వందల ఓటర్లు ఉన్నారు కానీ ఇప్పుడు పెంచే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి జిల్లా కలెక్టర్‌లకు ప్రజలకు ఓటింగ్‌పై అవగాహన కల్పించాలని సూచించాం. బూత్‌ లెవల్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్గిస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లు ఈఆర్వోలు పర్యవేక్షిస్తారు.ఇప్పటికే ఈవీఎంలు, వివి ప్యాట్‌లు ఆసిఫాబాద్‌ జిల్లాకు చేరుకున్నాయి.18 వరకు అన్ని జిల్లాలకు మిషన్లను పంపించాలి అనుకున్నాం. కానీ 20వ తేదీ వరకు అన్ని జిల్లాలకు చేరుకుంటాయి. మిషన్లు వచ్చాక ఎఫ్‌ ఎల్సీ నిర్వహిస్తాం.ఈ మిషన్ల వాడకం అన్ని రాజకీయ పార్టీలకు వివరిస్తాం. వివి ప్యాట్‌లు ఏడు సెకెండ్ల పాటు డిస్‌ప్లే అవుతాయి, ఓటర్ల సంఖ్య అనుగుణంగా 7 సెకండ్లు నిర్ణయించారు. వివి ఫ్యాట్‌ల వాడకంపై సమస్యలు తలెత్తితే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయవచ్చును. ఎన్నికల మిషన్లు రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక్కసారి జిల్లాకు వెళ్లక మరోసారి బూత్‌ లెవల్‌లో పనితీరును పరిశీలిస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని మిషన్లను ఆయా బూత్‌లకు చేరవేస్తామన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌, రాష్ట్ర ఎన్నికల అధికారులు ఈవీఎంలు ఎక్కడకు వెళ్తున్నాయో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపు తారు. పర్యవేక్షణ పూర్తి అయ్యాకే తేదీల ప్రకటన ఉంటుంది. ఓటింగ్‌ శాతం పెంచడమే ఎన్నికల సంఘంం ప్రధాన లక్ష్యం. 6నెలల్లో ఎన్నికలు నిర్వహించడం కష్టమే కానీ ఒక సవాల్‌గా తీసుకుని ముందుకు వెళ్తాం. ఆర్వోలు,ఇఆర్వోలకు నాలుగు రోజుల శిక్షణ ఉంటుంది. అనంతరం పరీక్ష నిర్వహిస్తాం. అందులో పాస్‌ అయితేనే ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారు అని స్పష్టం చేశారు.
‘ఈనెల 24వ తేదీ నుంచి శిక్షణా తరగతులు ఉండే అవకాశం ఉంది. ఈ ఎన్నికల నిర్వహణలో గత ఎన్నికల బ్యాలెట్‌ యూనిట్‌ల కంటే ఈసారి 10శాతం పెంచుతున్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 32,574 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. 52,100 బ్యాలెట్‌ యూనిట్లు అవసరం అవుతాయి. ఒక్క బ్యాలెట్‌ యూనిట్‌లో నోటాతో కలిపి 16 అభ్యర్థుల పేర్లు ఉంటాయి. ఎన్నికలకు 41,000 కంట్రోల్‌ యూనిట్స్‌,44 వేల వివి ఫ్యాట్స్‌ అవసరం అవుతాయి. సన్‌లైట్‌ ఎక్కువ ఉండే వివి ఫ్యాట్‌ చురుగ్గా పని చేయదు. ప్రధానంగా 3 అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాం. శాంతిభద్రత,ఆర్థిక లావాదేవీలు, మోడల్‌ ఓట్‌ ఆఫ్‌ కండక్ట్‌. శాంతి భద్రత విషయంలో 2014లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. వెనుకబడిన ప్రజలకు,వికలాంగులకు పోలింగ్‌ బూత్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇచ్చాము. రౌడీలుగా పేర్లు నమోదు ఉన్నవారి పై ప్రత్యేక నిఘా ఉంటుంది. ఎన్నికల నిర్వహణకు సరిపోయేంత పోలీస్‌ ఫోర్స్‌ ఉంది.రాష్ట్రంలో 7 జిల్లాలు కొంచెం సమస్యాత్మకంగా ఉన్నాయని గుర్తించాం. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం. దీనిపై కేంద్ర హోమ్‌ శాఖ చర్చించి పారా మిలటరీ బలగాలను వాడుకుంటాం.గత ఎన్నికల్లో 76 కోట్ల రూపాయలను సీజ్‌ చేశాం. వంద శాతం తనిఖీలు నిర్వహిస్తాం. అభ్యర్థుల ఖర్చుపై నిఘా పెడుతాం. పేయిడ్‌ అర్టికల్స్‌పై మీడియా మానటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఏ మ్యానిఫెస్టో విడుదల చేసినా మేము పరిశీలించి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపిస్తాం. సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు ప్రజలను ప్రభావితం చేసే అంశాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఫేస్‌బుక్‌,వాట్స్‌యాప్‌,ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియా సంస్థల అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం చర్చించింది. ఎన్నికల నిర్వహణలో మేము కూడా సహకరిస్తామని హామీ ఇచ్చారు. అన్ని జిల్లాలో హెల్ప్‌డెస్క్‌ 1950 ఉంది. దీనికి ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల నిర్వహణ పనులు వేగవం తం చేశాం. దివ్యాంగులకు ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. దీని కోసం వివిఎస్‌ లక్ష్మణ్‌, పుల్లెల గోపిచంద్‌లతో ప్రచార వీడియోను రూపొందిస్తున్నాం. 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఎన్నికల నిర్వహణ అంశంపై ఇప్పుడే ఏం చెప్పలేము. ఈసారి ఎన్నికల్లో 100 శాతం కొత్త ఈవీఎ మిషన్లు వాడుతాం.ముంపు మండల ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌ సీఈఓ,తెలంగాణ సీఈఓ రిపోర్ట్‌ తయారు చేసి కేంద్ర ఎన్నికల కమిషన్‌ పంపించాము. ఓటర్‌ లిస్ట్‌లో వికలాంగులను గుర్తించి వారి కోసం బూత్‌ చర్చేందుకు సౌకర్యాలు కల్పిస్తాం. ఎన్నికల సమయంలో ప్రభుత్వ పథకాల అమలు విషయంలో సిఎస్‌తో కమిటీ వేసి చర్చించాం.అని తెలిపారు.