24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

MOONSOONFFF

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తరాంధ్రను వణికిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతున్నదని, మరో 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని, 20 నుంచి 25 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. విశాఖకు ఆగ్నేయంగా 95 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది. మత్స్యకారులు వేటకెళ్లొద్దని వాతావారణశాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే అన్ని ప్రధాన పోర్టులలో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.