24న ‘మహానుభావుడు. ప్రీరిలీజ్‌ వేడుక

Mahaanu bhavudu movie-1
Mahaanu bhavudu movie

24న ‘మహానుభావుడు. ప్రీరిలీజ్‌ వేడుక

శర్వానంద్‌ హీరోగా, మెహ్రీన్‌కౌర్‌ హీరోయిన్‌గా మారుతి దర్శకత్వంలో యువి క్రియేషన్స్‌ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్‌లు సంయక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం మహానుభావుడు. చిత్రం . ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది.. యుబై ఎ సర్టిఫికెట్‌ అందుకుంది.. విజయదశమిరోజుప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 29న విడుదల కానుంది.. ఇటలీ, ఆస్ట్రియా, క్రొయెషియా లాంటి విదేశాల్లో , పొలాచ్చి, రామోజీ ఫిల్మ్‌సిటీ, హైదరబాద్‌లో అందరమైన లొకేషన్స్‌లో ఈచిత్రం షూటింగ్‌ జరుపుకుంది. ఎస్‌ఎస్‌ థమన్‌ అందించిన ఆడియో చార్ట్‌లిస్ట్‌లో నెంబర్‌1గా ఉండటం విశేషం.. ఈసందర్భంగా నిర్మాతలు మాట్లాడారు.. మా బ్యానర్‌లో వస్తున్న మహానుభావుడు చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకుందన్నారు. సెప్టెబంర్‌ 29న విజయదశమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నామన్నారు.. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈచిత్రానికి ఇంటిల్లిపాది అలరించేలా దర్శకుడు మారుతి తెరకెక్కించారన్నారు.. హీరో శర్వానంద్‌ ఓసిడి పాత్రలో నటించాడన,ఇ అతిపరిశుభ్రత అనే కాన్సెప్ట్‌తో మారుతి చేయించిన కామెడీ చిత్రానికి హైలెట్‌ అవుతుందన్నారు.. మెహరిన్‌ చాలా అందంగా నటించిందన్నారు.. థమన్‌ సంగీతం ఇప్పటికే మంచి విజయం సాధించిందన్నారు.. కాగా సెప్టెంబర్‌ 24న ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహిస్తున్నామని తెలిపారు.. శర్వానంద్‌, మొహరిన్‌, వెన్నెల కిషోర్‌, రాజర్‌, భద్రం, కళ్యాణి నటరాజ్‌, భాను , హిమజ, వేణు, సుదర్శన్‌, సాయి, వెంకీ , శంకరరావు, రమాదేవి, మధుమణి, రాగిణి, రజిత, అబ్బులు చౌదరి,సుభాష్‌, ఆర్కే తదితరులు నటించారు.