దేశంలో కొత్త‌గా 23,529 క‌రోనా కేసులు


మొత్తం కేసుల సంఖ్య 3,37,39,980
మొత్తం మృతుల సంఖ్య 4,48,062

న్యూఢిల్లీ : దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు పెరిగాయి. దేశంలో కొత్త‌గా 23,529 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,37,39,980కు చేరింది. దేశంలో తాజాగా 28,718 మంది కోలుకోగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,30,14,898 మంది కోలుకున్నారు.

ఇక నిన్న క‌రోనాతో 311 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,48,062కి చేరింది. 2,77,020 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స పొందుతున్నారు. కేర‌ళ‌లో కొత్త‌గా 12,161 మందికి క‌రోనా సోకింది. 155 మంది నిన్న ఆ రాష్ట్రంలో క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/