బ్రెజిల్‌ కొత్తగా 23,431 కేసులు నమోదు

మొత్తం కరోనా కేసులు..3,605,783

బ్రెజిల్‌ కొత్తగా 23,431 కేసులు నమోదు
brazil -corona virus

బ్రసిలియా: బ్రిజిల్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 23,431 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసులు సంఖ్య 3,605,783కు చేరుకుందని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. గడిచిన 24 గంటల్లో 494 మంది వ్యాధి బారిన పడి మృతిచెందగా మొత్తం మరణాల సంఖ్య 114,744కు చేరింది. శుక్రవారం 50,000 కేసులు నమోదు కాగా 900 మంది మరణించారు. శనివారం 30,000 కరోనా కేసులు నమోదు కాగా 1,045 మంది వ్యాధి బారిన పడి మరణించారు. ఇప్పటివరకు దేశంలో 27లక్షలకు పైగా కరోనా నుంచి కోలుకున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/