ప్రారంభమైన చిన్న మేడారం జాతర

ప్రారంభమైన చిన్న మేడారం జాతర

వరంగల్‌: ఈరోజు నుండి మేడారం చిన్న జాతర నాలుగురోజులు జరగనుంది.మహా జాతర ముగిసిన తర్వాత ఏడాదికి మాఘ శుద్ధ పౌర్ణమి వేళ పూజారులు ఖమండ మలిగే పండుగగ నిర్వహిస్తారు. దీన్నే చిన్న జాతరగా పిలుస్తుంటారు. దీని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు.పెద్ద ఉత్సవానికి వెళ్లలేని వారందరూ చిన్న జాతరకు అధిక సంఖ్యలో తరలివస్తారు. అమ్మవార్లకు మొక్కులు సమర్పిస్తారు. రెండేళ్లకోసారి జరిగే ఈ చిన్న పండుగకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.