మెక్సిలో సిటిలో ఘోర అగ్నిప్రమాదం

ire Accident in Mexico
Fire Accident in Mexico

మెక్సికో: అమెరికాలోని మెక్సికో సిటీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ బార్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 23 మంది సజీవదహనంకాగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ఎనిమిది మహిళలు కాగా మిగితావారు 15 మంది పురుషులుగా గుర్తించారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటాన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. (కాక్ టైల్) వైన్ సీసాకు మంట అంటుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/