23 లక్షల పంపుసెట్లకు నిరంతర విద్యుత్‌

TS CM KCR
TS CM KCR

23 లక్షల పంపుసెట్లకు  నిరంతర విద్యుత్‌

వచ్చే రబీ నుంచి శాశ్వత ప్రాతిపదికన విద్యుత్‌ సరఫరా
భూగర్భ జలాలను కాపాడేందుకు ఆటోస్ట్రాటర్లు తొలగింపు
24 గంటల ఉచిత విద్యుత్‌పై అసెంబ్లీలో సిఎం కెసిఆర్‌ ప్రకటన

హైదరాబాద్‌: వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందనే సంతోషకరమైన విషయాన్ని సగ ర్వంగా తెలియజేస్తున్నట్లు టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీలో బుధ వారంనాడు ప్రకటించారు. దేశంలో మరెక్కడాలేని విధం గా చరిత్రలో మొదటిసారిగా రాష్ట్రంలోని దాదాపు 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు గతరాత్రి నుంచి ప్రయోగా త్మకంగా 24 గంటల కరెంట్‌ సరఫరా జరుగుతున్నదని తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

దశాబ్దాల పాటు కరెంట్‌ కష్టాలు అనుభవించిన రైతాంగా నికి ఇది తీపి కబురు. 24 గంటల పాటు విద్యుత్‌ సర ఫరా చేయడం ద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఐదారు రోజుల పాటు అధ్యయనం చేసి, వచ్చే రబీ నుంచి శాశ్వత ప్రాతిపదికన నిరంతరాయ విద్యుత్‌ సరఫరా చేయడానికి విద్యుత్‌ శాఖ తుది ఏర్పాట్లు చేస్తున్నది., తెలంగాణ రాష్ట్రంలో 25శాతం విద్యుత్‌, వ్యవసాయ పంపుసెట్ల ద్వారానే వినియోగమవుతున్నది. రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజుల నుంచే పంపుసెట్లకు 9గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరుగుతున్నది, గత జూలై నెల నుంచి పాత మెదక్‌, కరీంనగర్‌, నల్లగొండ జిల్లాల్లో రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా అందుబాటులోకి వచ్చింది. వచ్చేరబీ నుంచి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసె ట్లకు 24 గంటల పాటు నిరంతరాయ కరెంట్‌ సరఫరా చేయడానికి విద్యుత్‌ శాఖ అన్ని రకాల ఏర్పాట్టు చేసింది. అందుకు కావాల్సిన విద్యుత్‌ను కూడా సమకూర్చు కుం టున్నది. ఇటీవల రాష్ట్రంలో 9500 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ ఏర్పడినా ఎక్కడా రెప్పపాటు కూడా కోత విధిం చకుండా రికార్టు స్థాయిలో 198 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా చేయడం జరిగింది. వచ్చే రబీ సీజన్‌లో వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇవ్వడం వల్ల ఏర్పడే 11,000 మెగావాట్ల డిమాండ్‌ మేరకు సరఫరా చేయ డానికి విద్యుత్‌ సంస్థలు సర్వసన్నద్దంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజున తీవ్రమైన విద్యుత్‌ సంక్షోభం నెలకొని ఉందని, నిత్యం కరెంట్‌ కోత లతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. హైద రాబాద్‌ నగరంలో రోజు నుంచి నాలుగు గంటలు, ఇతర నగరాలు, పట్టణాల్లో ఆరు గంటలు, గ్రామాల్లో 9 గంటలు అధికారిక విద్యుత్‌ కోతలు అమలయ్యేవన్నారు. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్‌ హాలిడేలుండే వన్నారు. కావాల్సినంత కరెంట్‌ లేకపోవడంతో పరిశ్రమ లు పెద్ద ఎత్తున మూతపడ్డాయన్నారు. కరెంట్‌ కోసం పిక్కి,సిఐఐ ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలు నిత్యం ధర్నాలు చేసేవారు. అటు ఇందిరా పార్క్‌, ఇటు విద్యుత్‌ సౌదలో ఎప్పుడూ ఆందోళనలే కొనసాగేవన్నా రు. హైదరాబాద్‌లో పరిశ్రమలు పెట్టాలంటేనే ాబాద్‌లో పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడే వాతా వరణం ఉండేదన్నారు.వ్యవసాయానికి రెండు,మూడు గంటల కరెంట్‌ కూడా అందకపోవడంతో పంటలు ఎండిపోయేవ న్నారు. భూగర్భంలో నీళ్లున్నా తోడుకునేందుకు కరెంట్‌ లేక చేతికొచ్చిన పంట కళ్లెదుటే ఎండిపోతున్నా రైతాంగం ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడేది. ఆపారమైన పంట నష్టం రైతులను ఆర్థికంగా కృంగ దీసేదన్నారు.

తెలంగాణ ఏర్పడిన నాడు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 6,574 మెగావాట్లు, ఇందులో నికరంగా విద్యుత్‌ ధర్మల్‌ పవర్‌ ప్లాంట్ల సామర్థ్యం 4,300 మెగావాట్లు. జల విద్యుత్‌ 2,081 మెగావాట్లు, నాడు తెలంగాణ రాష్ట్రానికి 2700 మెగావాట్ల వరకు విద్యుత్‌ లోటు ఉండేది. డిమాం డ్‌కు సరిపడినంత సరఫరా జరుగలేదన్నారు. ‘అలాంటి పరిస్థితి నుంచి నేడు, నేనిక్కడ ఈ సభలో ఈ ప్రకటన చదువుతున్న నిమిషానికే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌ సరఫరా జరుగుతున్నదని సగర్వంగా, సంతోషంగా ప్రకటిస్తున్నాను అని స్పష్టం చేశారు. దాదాపు రూ.94వేల కోట్ల వ్యయంతో తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చేందుకు కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా నత్తనడకన నడుస్తున్న ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పరుగులు పెట్టించింది. కొత్త ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పంపిణీ, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 6,574 మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ ఉంటే,గడిచిన మూడున్నర సంవత్సరాల వ్యవధిలోనే అదనంగా మరో 7.981 మెగావాట్ల విద్యుత్‌ను సమకూర్చు కోగలి గింది.సింగరేణి పవర్‌ ప్లాంటు ద్వారా 1200 మెగావాట్లు, కెటిపిసి ద్వారా 600 మెగావాట్లు, జూరాల ద్వారా 240 మెగా వాట్లు, పులిచింతల ద్వారా 90 మెగావాట్లు, చత్తీస్‌గఢ్‌ నుంచి 1000 మెగావాట్లు,సిజిఎస్‌ తదితర మార్గాల ద్వారా మరో 2000 మెగావాట్లు అదనంగా సమకూర్చుకోవడం జరిగిందన్నారు

. గ్రీన్‌ పవర్‌ ఉత్పత్తి గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో కొత్తసోలార్‌ పాలసీని తీసుకురావడం జరిగిందన్నారు. దీని ఫలితంగా తెలంగాణ రాష్ట్రం 2,792 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తితో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని సగర్వంగా ప్రకటిస్తున్నానన్నారు. వీటన్నింటి ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 14,555 మెగావాట్లు, మరో 13,752 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కోసం కొత్త పాంట్ల నిర్మాణం జరుగుతున్నదన్నారు. వ్యవసా యానికి 24 గంటల కరెంట్‌ సరఫరాతో పాటు, కొత్తగా నిర్మించే ఎత్తిపోతల పథకాలకు 8,500 మెగావాట్లు అవసరం అవుతుందన్నారు.

కొత్తగా నెలకొల్పే పరిశ్రమలతో పాటు ఇతరత్రా పెరిగే డిమాండ్‌కోసం విద్యుత్‌ను సమకూర్చు కోవడం కోసం ఈ కొత్త విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం జరుగు తున్నదన్నారు. 4వేల మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి అల్ట్రా మెగా పవర్‌ప్లాంటు నిర్మాణం జరుగుతున్నదన్నారు. మణుగూరు,కొత్తగూడెం ప్రాంతాల్లో నిర్మిస్తున్న పవర్‌ ప్లాంట్ల ద్వారా 1,880 మెగావాట్ల విద్యుత్‌ వచ్చే ఏడాది అందు బాటులోకి వస్తుంది. ఎన్‌టిపిసి అధ్వర్యంలో 1600మెగావాట్ల విద్యుత్‌ప్లాంటు నిర్మాణంలో ఉందన్నారు. 28వేల మెగా వాట్లకు పైగా స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పి తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

పూర్థి స్థాయి పారదర్శకత సాధించడం కోసం జాప్యాన్ని నివారించడం కోసం విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణాలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిహెచ్‌ఇఎల్‌కు అప్పగించడం జరిగిందన్నారు. రూ.12,136 కోట్ల వ్యయంతో పంపిణీ, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయ డానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 400 కెవి సబ్‌ స్టేషన్లు ఆరు ఉంటే, కొత్తగా మరో ఐదునిర్మించి వాటి సంఖ్యను 11కు చేర్చామన్నారు. 400 కెవి సబ్‌ స్టేషన్లు మరో 5 నిర్మించడానికి ప్రణాళిక రచించడం జరిగిందన్నారు. 220 కెవి సబ్‌స్టేషన్లు 51 ఉంటే కొత్తగా మరో 19 నిర్మించి, వాటి సంఖ్యను 70కి పెంచడం జరిగిందన్నారు. 132 కెవి సబ్‌ స్టేషన్లు 176 ఉంటే కొత్తగా 35 నిర్మించి,వాటి సంఖ్యను 211కు పెంచడం జరిగిందన్నారు. 33 కెవి సబ్‌ స్టేషన్లు 2,181 ఉంటే, కొత్తగా 515 నిర్మించి వాటి సంఖ్యను 2,696కు పెంచడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అన్ని రకాల సబ్‌ స్టేషన్లు కలిపి 2.414 ఉండగా, 574 సబ్‌ స్టేషన్లను కొత్తగా నిర్మించి నేడు 2,988 సబ్‌ స్టేషన్లను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. రాబోయే మూడు, నాలుగేళ్లలో పంపిణీ, సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి 42వేల కోట్ల పెట్టుబడితో కొత్తగా పద్దెనిమిది 400 కెవి సబ్‌ స్టేషన్లు, 34 220 కెవి సబ్‌ స్టేషన్లు,తొంబై 132 కెవి సబ్‌ స్టేషన్లు, తొమ్మిది వందలముప్పయిఏడు 33/11 కెవి సబ్‌ స్టేషన్లు నిర్మించడానికి ప్రణాళిక రూపొందించబడిందన్నారు. నాడు 400 కెవి లైన్లు 1682 కిలో మీటర్లుంటే కొత్తగా 1,012 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయడం జరిగిందన్నా రు.

220 కెవి లైన్లు నాడు5,559 కిలోమీటర్లు ఉంటే కొత్తగా 1340 కిలోమీటర్ల లైను వేయడం జరిగిందన్నారు. 132 కెవి లైన్లు నాడు 9,136 కిలోమీటర్లుంటే కొత్తగా 1,184 కిలోమీటర్లు వేయడం జరిగిందన్నారు. మొత్తం హైటెన్షన్‌ లైన్లు నాడు 16,378 కిలోమీటర్లుంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా 3,537 కిలోమీటర్లు కొత్తగా వేయడం జరిగిందన్నారు. నేడు తెలంగాణ లో 19,916 కిలోమీటర్లు మేరు హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్లు ఉన్నాయన్నారు. డిస్ట్రీబ్యూషన్ల లైను కూడా భారీ స్థాయిలో పెంచడం జరిగిందన్నారు. 33 కెవి లైన్లు నాడు 17,760 కిలోమీటర్లుంటే అదనంగా 4,180 కిలోమీటర్లు వేయడం జరిగిందన్నారు. 11 కెవి లైన్లు నాడు 1,20,834 కిలోమీటర్లుంటే కొత్తగా 25,551 కిలోమీటర్లు వేయడం జరిగిందన్నారు.

ఎల్‌టి లైన్లు నాడు 2,94, 374 కిలోమీటర్టుంటే కొత్తగా 21,302 కిలోమీటర్లు వేయడం జరిగిందన్నారు. మొత్తం డిస్ట్రీబ్యూటరీ లైన్లు నాడు 4,32,968 కిలోమీటర్లుంటే కొత్తగా 51,033 కిలోమీటర్లు జత చేయడం ద్వారా నేడు తెలంగాణలో 4,84,001 కిలోమీటర్ల లైన్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా వ్యవస్థతను తీర్చిదిద్దడం కోసం హైటెన్సన్‌ సరఫరా సామర్థ్యాన్ని 12,653 మెగావాట్ల నుంచి 20,660 మెగావాట్లకు పెంచడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం చూపించిన చొరవ కారణంగా ఉత్తర, దక్షిణ గ్రిడ్‌ల మధ్య కొత్త విద్యుత్‌ లైన్ల నిర్మాణం కూడా జరిగింద న్నారు. వార్దా-మహేశ్వరం వయా డిచ్‌పల్లిల మధ్య 765 డబుల్‌ సర్క్యూట్‌ లైన్‌ నిర్మాణం పూర్తయిందన్నారు. వరంగల్‌- వరోరా లైను మరో మూడేళ్లలో నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఈ లైన్ల ద్వారా తెలంగాణ రాష్ట్రం 2,000 మెగా వాట్ల విద్యుత్‌ పొందడానికి వీలుగా పిజిసిఐఎల్‌తో ఒప్పందం చేసుకుందన్నారు. ఈ లైన్ల ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా కావాల్సినంత విద్యుత్‌ పొందే వెసులుబాటు తెలంగాణ రాష్ట్రానికి కలిగిందన్నారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో నిరంతర విద్యుత్‌ సరఫరా జరగడానికి వీలుగా జిహెచ్‌ఎంసి చుట్టూ 142 కిలోమీటర్ల మేర 400 కెవి రింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ లైన్లను అనుసంధానం చేయడం కోసం 220 కెవి సబ్‌స్టేషన్లు ఆరింటిని నిర్మించడం జరిగిందన్నారు.తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సంస్థల ఆర్ధిక క్రమశిక్షణకు మెరుగైన పనితీరుకు ప్రశంసాపూర్వకంగా ఆర్‌ఇసి,పిఎఫ్‌సి లాంటి ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణంపై వడ్డీని 12% నుంచి 9.95 శాతానికి తగ్గించాయి. దీని వల్ల ప్రతి ఏటా విద్యుత్‌ సంస్థలకు రూ.200 కోట్ల మేర వడ్డీ భారం తగ్గుతుందన్నారు. డిస్కమ్‌లపై ఆర్ధిక భారం తొలగించడానికి తెలంగాణ ఉద§్‌ు పథకంలో చేరిందన్నారు. డిస్కమ్‌లకున్న 8.923 కోట్ల రుణ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు. దీని ద్వారా డిస్కమ్‌లు రుణ విముక్తి పొంది, మరింత స్వేచ్చగా తమ కార్యకలాపాలు నిర్వహించడం సాధ్యమవుతుందన్నారు.

ప్రభుత్వం పేదలకు విద్యుత్‌ సబ్సిడీలు అందించడం కోసం బడ్జెట్‌లో రూ. 4,777 కోట్లు కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ అందిస్తున్న శుభ తరుణంలో రైతులకు వినమ్రక పూర్వక విజ్ఞప్తి చేశారు.

దయచేసి ఆటో స్టార్టర్లను తొలగించుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. కేవలం విద్యుత్‌ ఆదా చేయడం కోసం ఆటో స్టార్టర్లను తొలగించాలని కోరడ లేదు. భూగర్భ జలాలను కాపాడటం కోసం కూడా ఆటో స్టార్టర్ల తొలగింపు తప్పని సరి అని విన్న వించుకుంటున్నాను.

విద్యుత్‌ సంస్థల ను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నద న్నారు. విద్యుత్‌ సంస్థలలో పనిచేసే 22,550 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యో గులను కాంట్రాక్టు వ్యవస్థ నుంచి తప్పించి నేరుగా జీతాలు చెల్లిస్తున్నామన్నారు. విద్యుత్‌ సంస్థల్లో కొత్తగా 13,357 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నదన్నారు. విద్యుత్‌ సంస్థల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అంకిత భావంతో కష్టపడి పనిచేసి మెరుగైన పరిస్థితి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని విద్యుత్‌ ఉద్యో గులందరికీ అభినందనలు తెలుపుతున్నామన్నారు.చిత్తశుద్దితో పనిచేస్తున్న విద్యు త్‌ ఉద్యోగులకు ప్రభుత్వం అండదండగా ఉంటుందని ప్రకటిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్‌ను అవసరం ఉన్నంత మేరకు సరఫరా చేయడానికి ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని మరోసారి ప్రకటిస్తున్నట్లు తెలిపారు.