23 జలాశయాల్లో 4 కోట్ల రొయ్య పిల్లల విడుదల

talasani
talasani

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ ఏడాది 75.8 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. సచివాలయంలో మత్స్యశాఖ అధికారులతో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ నెల 31న భూపాలపల్లి జిల్లాలో చేప పిల్లల పంపిణీని ప్రారంభిస్తామని తెలిపారు. ఘన్‌పూర్‌ చెరువు, ములుగు పరిధిలోని రామప్ప చెరువులో చేపపిల్లలను విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. 23 జలాశయాల్లో 4 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తామన్నారు. ఆగస్టు చివరి నాటికి మత్స్యకారులకు రాయితీ వాహనాలు పంపిణీ చేస్తామని మంత్రి తలసాని ప్రకటించారు.