23వ పాశురం

MANJULA SRI
మారి మలై ముళంగల్‌ మన్నిక్కిడ న్దుఱంగుమ్‌
శీరియశింగమఱివిత్తు త్తీ విళిత్తు
వేరిమయిర్‌ పొంగవెప్పాడుమ్‌ పేర్‌న్దుదఱి
మూరి నిమిర్‌న్దు ముళంగి ప్పఱప్పట్టు
పోదరుమాపోలే నీపూవై ప్పూవణ్ణా, ఉన్‌
కోయిల్‌ నిని€ంగనే పోందరుళి, కోప్పుడైయ
శీరియ శింగాననత్తిరున్దు, యామ్‌వన్ద
కారియ మారాయ్ న్దరుళే లో రెమ్బావాయ్II
ఇరవై మూడవ పాట
కొండ గుహయందు నిదురించు కొదమసింగం
రుద్రరూపము దాల్చి వడలు విరచి
భీకరంబుగ అఱచి కేశములు నిగడపొడిచి
నిద్రమేల్కొంచి గుహవిడిచి వెడలినట్లు
ఠీవి, దర్పము, శౌర్యము పొంగునట్లు
లేచి రావలె శౌరి! నీవారాజసింగమట్లు
వచ్చి, జయము నిచ్చెడు
రత్న సింహాసనమున చేరి
అడగవలయును మా మంచి చెడ్డలన్ని
నీలిదేహము నిగనిగా మెరయుచుండ
మేము నోచిన మానోము పంట పండ
భావం: శౌర్యము గల సింహం పర్వత గుహలో నిదురించుచున్నది. అది మేల్కొన్నది. అటు ఇటు చూచింది. పరిమళము గల వెంట్రుకలను నిగుడుగా దులుపుకొంది. బాగుగా సాగింది. గర్జించింది. వెలుపలికి రా. శ్రేష్టమైన మనోహరమైన సింహాసనముపై కూర్చొ. మేము వచ్చిన పనిని తెలుసుకో. మాపై దయచూపు.
ఫలం: అధికార ప్రాప్తి.