ఒడిశలో కొత్తగా 2,239 కేసులు నమోదు

Odisha- corona virus

భువనేశ్వర్‌: ఒడిశాలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 2,239 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 9 మంది మృతి చెందారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 64,533 కరోనా కేసులు నమోదు కాగా 43,779 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 20,339 మంది దవాఖానలో చికిత్స పొందుతుండగా 362 మంది మృతి చెందారని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇదిలాఉండగా దేశవ్యాప్తంగానూ కరోనా కల్లోలం తగ్గడం లేదు. ఇప్పటివరకు 27 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 19.7 లక్షల మంది చికిత్సకు కోలుకోగా 6.7 లక్షల మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 51,797 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/