22న తెలంగాణకు కేంద్ర ఎన్నికల బృందం

CEC
CEC

హైదరాబాద్‌: తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమీక్షించనుంది. 22 న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానుంది. అదేరోజు సీఈసీ, అధికారులతో సమీక్ష నిర్వహించనుంది. 23న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో , 24న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి , ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు.