దేశంలో కొత్త‌గా 21,257 క‌రోనా కేసులు

మొత్తం మృతుల సంఖ్య 4,50,127
మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌ 3,39,15,569

న్యూఢిల్లీ : దేశంలో కొత్త‌గా 21,257 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం… యాక్టివ్ కేసులు 205 రోజుల క‌నిష్ఠానికి చేరాయి. ప్ర‌స్తుతం 2,40,221 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో నిన్న 271 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,50,127కి చేరింది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య‌ 3,39,15,569గా ఉంది. దేశంలో నిన్న 50,17,753 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. దీంతో వినియోగించిన మొత్తం డోసుల సంఖ్య 93,17,17,191కి చేరింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/