21న ఐసిసి అవార్డుల ప్రకటన

s12
S,mith

21న ఐసిసి అవార్డుల ప్రకటన

న్యూఢిల్లీ: ఈ ఏడాది మెరుగైన ఫామ్‌లో ఉన్న టీమిండియా టెస్టు కెప్టెన్‌ కోహ్లీ ఐసిసి ప్రకటించే అవార్డుల్లో అరుదైన గౌరవం దక్కించుకునే అవకాశం ఉండేలా కనిపిస్తుంది.కాగా 2015 సంవత్సరాని గాను ఐసిసి ప్రకటించిన అవార్డుల్లో ఏ ఒక్క భారత క్రికెటర్‌కు కూడా చోటు దక్కలేదు.అయితే ఐసిసి టెస్టు,వన్డే టీమ్‌ ఆప్‌ ది ఇయర్‌ అవార్డులతో పాటు వ్యక్తిగత విభాగాలకు సంబంధించి ఐసిసి అవార్డులను బుధవారం ప్రకటించింది.కాగా 14 సెప్టెంబరు 2015 నుంచి సెప్టెంబరు 2016 మధ్య కాలంలో ఆయా జట్ల ప్రదర్శన ఆధారంగా అత్యుత్తమ జట్లను ఎంపిక చేస్తుంది.ఇక వ్యక్తిగత విభాగానికి సంబంధించిన అవార్డుల విషయానికి వస్తే ద్రావిడ్‌, గ్యారీ క్రిస్టెన్‌,సంగక్కర నేతృత్వంలోని సెలక్షన్‌ ప్యానెల్‌ ఐసిసి టెస్టు,వన్డే టీమ్‌ను ఎంపిక చేయనుంది.

కాగా 2015 సంవత్సరానికి గాను ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌, టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ఇయర్‌ అవార్డుని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

2015 సంవత్సరానికి గాను ఐసిసి అవార్డుల జబితా

1.ఐసిసి క్రికెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ – సర్‌ గర్‌ఫిల్డ్‌ సోబర్‌ ట్రోఫి స్టీవ్‌ స్మిత్‌ ఆస్ట్రేలియా

2.టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ – స్టీవ్‌ స్మిత్‌ ఆస్ట్రేలియా

3.వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ – డివిలియర్స్‌ దక్షిణాఫ్రికా

4.మహిళల వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ – మెగ్‌ లెన్నింగ్‌ ఆస్ట్రేలియా

5.మహిళల టి20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-స్టెఫానీ టేలర్‌్‌ వెస్టిండీస్‌

6.టి20 అత్యుత్తమ ప్రదర్శన -డు ప్లెసిస్‌ దక్షిణాఫ్రికా

7.ఎమర్జింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌- హజిల్‌వుడ్‌ ఆస్ట్రేలియా

8.అసోసియేట్‌,అపిలియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ -కుర్రంఖాన్‌ యుఎఇ

9.స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆవార్డు- బ్రెండన్‌ మెక్‌కెల్లమ్‌ న్యూజిలాండ్‌

10.అంపైర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ -రిచర్డ్‌ కెటిల్‌ బోరఫ్‌ ఇంగ్లండ్‌