20వ పాశురం: తిరుప్పావై

ఆధ్యాత్మిక చింతన

GODADEVI
GODADEVI

‘ముప్పత్తుమూవర్‌ అమరర్కుమున్‌ శెసు ,
కప్పమ్‌ తవిర్కుమ్‌ కలియే తుయిలెళాయ్
శెప్పముడైయాయ్! తిఱలుడై యాయ్! శెత్తార్కు
వెప్పం కొడుక్కుమ్‌ విమలా! తుయిలెళాయ్
శెప్పన్న మెన్ములైచ్చెవ్వా§్‌ు చ్చిఱు మరుజ్గుల్‌
నప్పిన్నైనజ్గాయ్! తిరువే! తుయిలెళాయ్
ఉక్కముమ్‌ తట్టొళియుమ్‌ తన్దున్‌ మణాళనై
ఇప్పోతే యెమ్మై నీరాట్టేలో రెమ్బవాయ్

భావం: ముప్పది మూడుకోట్ల దేవతలకు ఆపద వచ్చునేమోయని, వారి భయమును పోగొట్టు టకై శత్రువులను భయపెట్టువాడు, మనోవ క్కాయ కర్మలచేత ఆశ్రితశత్రువులకు భయ జ్వరము కలిగించువాడు. బలము గలవాడు అయిన ఓ కృష్ణా మేల్కొనుము

‘బంగారు చెండులవంటి మరియు సుకుమారమైన స్థనసౌందర్యముకల ఎర్రని పెదవులుకల సన్నని నడుము కల లక్ష్మీసంపన్నురాలా! నీలా! నిద్ర మేల్కొని నడిచిరావమ్మా! విసనకర్ర మరియు అద్దము ఇవ్వవ్మా! నీ వల్లభుని మాతో స్నామాడుటకు ఒప్పించవమ్మా! అని వెలుపలి గోపికలు నీలాదేవిని కోరుతున్నారు.
ఫలం : అన్యోన్నదాంపత్యం.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/