భారత్‌లో కొత్తగా 20,550 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,44,853..మొత్తం మృతుల సంఖ్య 1,48,439

Corona cases exceeding one crore in India-
Corona cases India-

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా 20,550 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 26,572 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,44,853కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 286 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,48,439కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 98,34,141 మంది కోలుకున్నారు. 2,62,272 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/